: సిక్కింలో బీజేపీకి షాక్... ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సాధించిన ఓట్లు 374


సిక్కింలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘోరపరాజయం పాలైంది. నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ అనర్హతకు గురికావడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో జరిగిన పోలింగ్ ఫలితాలు నేడు వెల్లడించారు. ఈ ఫలితాల్లో అధికార సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) అభ్యర్థి దిల్లీ రామ్‌ థాపా విజయం సాధించారు. ఈ ఉపఎన్నికలో 9,427 ఓట్లు పోలవ్వగా విజేత రామ్ థాపాకు 8,406 ఓట్లు వచ్చాయి.

ఆయనకు గట్టి పోటీ ఇస్తారని భావించిన బీజేపీ అభ్యర్థి సురేష్‌ ఖనల్‌ శర్మకు కేవలం 374 ఓట్లు మాత్రమే రావడం విశేషం. దీంతో బీజేపీ ఘోరాపరాజయం చవిచూసింది. బీజేపీ పరిస్థితే ఇలా ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరం... ఆ పార్టీ అభ్యర్థి సుమిత్ర రాయ్‌ కి నోటా కంటే రెండు తక్కువగా 98 ఓట్లు రావడం విశేషం. ఈ ఎన్నికల బరిలో ఉన్న ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 449 ఓట్లు రావడం విశేషం. దీంతో వీరంతా డిపాజిట్లు కోల్పోయారు. 

  • Loading...

More Telugu News