: సంజయ్ దత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్


ఈ మధ్యే జైలు నుంచి విడుదలై... సినిమాల్లో నటించడం ప్రారంభించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బాలీవుడ్ దర్శక, నిర్మాత షకీల్‌ నూర్‌ అనీ‌ను బెదిరించిన కేసులో సంజయ్‌ దత్ కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఓ సినిమా విషయంలో షకీల్‌ నూర్‌, సంజయ్‌ దత్‌ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

షకీల్ నూరానీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సంజయ్ దత్ అంగీకరించాడు. దీనికి 50 లక్షల రెమ్యూనరేషన్ కు అంగీకరించాడు. అనంతరం రెండు రోజుల షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. అనంతరం రెమ్యూనరేషన్ కోటి రూపాయలు ఇస్తేనే నటిస్తానని, లేకపోతే నటించనని తెగేసి చెప్పాడు. దీంతో డబ్బులు తీసుకుని సంజయ్ దత్ మోసం చేశాడంటూ, షకీల్ నూరానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో న్యాయస్థానం సంజయ్‌ దత్‌ కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది.

  • Loading...

More Telugu News