: రాణించిన ఊతప్ప, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్...సన్ రైజర్స్ హైదరాబాదు లక్ష్యం 173
కోల్ కతా వేదికగా జరుగుతున్న 14వ ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ రాణించారు. ఆరంభంలోనే ఓపెనర్ సునీల్ నరైన్ (6), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (15) వికెట్లు కోల్పోయిన కోల్ కతాను కీపర్ రాబిన్ ఊతప్ప (68) అర్థసెంచరీతో ఆదుకోగా, అతనికి అద్భుతమైన ఫాంలో ఉన్న మనీష్ పాండే (46) ఆకట్టుకున్నాడు. వారికి యూసఫ్ పఠాన్ (20) సహకరించాడు. యాదవ్ (4), గ్రాండ్ హోం (0), వోక్స్ (1) విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టులో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో రాణించగా, నెహ్రా, రషీద్ ఖాన్, కట్టింగ్ చెరొక వికెట్ తీసి అతనికి సహకరించారు.