: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో టీడీపీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ!


రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ మధుసూదనాచారి బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పీకర్ కార్యాలయానికి వచ్చారు. దీంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన అనంతరం సభను ప్రోరోగ్ చేయలేదని, నివధిక వాయిదా వేశామని, దీంతో ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలకు అర్హత లేదని తెలిపారు. దీంతో బీఏసీ సమావేశం మధ్యలోనే సండ్ర వెంకటవీరయ్య లేచి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, విపక్ష నేతలు హాజరయ్యారు. కాగా, రేపు ఒక్కరోజే తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లపై చర్చించి, బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 

  • Loading...

More Telugu News