: పోలీసులు టీడీపీ పక్షాన పని చేస్తున్నారు...చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు: అంబటి రాంబాబు


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్రజాస్వామిక విధానాలను పాటిస్తున్నారని  ప్రొద్దుటూరు వివాదంపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరు ఘటనలో వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని అన్నారు. కడపలో అయినా, పొద్దుటూరులో అయినా చంద్రబాబునాయుడు దాడులను పెంచి పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఒక్క మున్సిపాలిటీలో ఓడిపోతే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే...పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించి, ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం నడిరోడ్డుమీద ఖూనీ అవుతుంటే ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకోవడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడులను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News