: జమ్మూకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించండి: బీజేపీ-పీడీపీపై విజయం సాధించిన ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ-పీడీపీ అభ్యర్థిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదని అన్నారు. ఉపఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగాయని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్ లో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. అశాంతి, అల్లర్లు పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. జరుగుతున్న అల్లర్లను ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని ఆయన మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ లో తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన విధిస్తే శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయని ఆయన సూచించారు.