: వెంకయ్యనాయుడి వ్యాఖ్యలను ఖండించిన డీఎస్


మతపరమైన రిజర్వేషన్లను కల్పించడం వల్ల మరో పాకిస్థాన్ పుడుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ ఖండించారు. రిజర్వేషన్లపై కేసీఆర్ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతులంతా ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఉచిత ఎరువుల పంపిణీ ఆలోచనను కేసీఆర్ కాపీ కొట్టారని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని డీఎస్ అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News