: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో తీవ్ర ఉద్రిక్తత... పోలీసు వాహనంపై రాళ్లదాడి.. ఎన్నిక వాయిదా


కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి వర్గాలుగా కౌన్సిలర్లు విడిపోయారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల సామాగ్రిని లింగారెడ్డి వర్గీయుడు పుల్లయ్య ఎత్తుకు పోయారు. వరదరాజులరెడ్డి వర్గీయులు కుర్చీలు, బెంచీలను ధ్వంసం చేశారు. దీంతో, ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. లాఠీఛార్జ్ లో ఒకరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో, పోలీసుల వాహనంపైకి టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్ ఎన్నికను ఆర్డీవో రేపటికి వాయిదా వేశారు.  

  • Loading...

More Telugu News