: మరోమారు కలవనున్న ఇద్దరు చంద్రులు.. సోమవారమే ముహూర్తం.. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యం!
విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు కలుసుకోనున్నారు. గవర్నర్ నరసింహన్ సారథ్యంలో సోమవారం వీరు భేటీ కానున్నారు. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై గవర్నర్ సమక్షంలో చర్చించనున్నారు.
ఏపీ సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం తదితర అంశాలపై ఇరువురు చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే విద్యుత్, సచివాలయ ఉద్యోగుల విభజన, అస్తుల పంపకంపై చర్చించనున్నట్టు సమాచారం. ఇవే అంశాలపై గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల మంత్రులు ఇప్పటి వరకు మూడుసార్లు చర్చించారు. ఆ చర్చల్లో తేలిన అంశాలను మంత్రులు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నివేదించారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్ కలిసి గవర్నర్ సమక్షంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం వీరు కలుసుకోనున్నట్టు సమాచారం.