: లోకేష్ ప్రసంగంలో దొర్లిన తప్పు.. నాలుక్కరుచుకున్న చినబాబు
ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రసంగంలో తప్పు దొర్లింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ, అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అన్నారు. దీంతో, పక్కన ఉన్నవారు వెంటనే స్పందించి... వర్ధంతి కాదు, జయంతి అని చెప్పారు. దీంతో, లోకేష్ నాలుక్కరుచుకున్నారు. సారీ... జయంతి అని సరిదిద్దుకున్నారు. మరోవైపు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో కూడా, లోకేష్ తడబడిన సంగతి తెలిసిందే. శ్రద్ధా పూర్వకంగా అనబోయి శ్రద్ధాంజలి అని తడబడ్డారు.