: మెదక్ లో కాంగ్రెస్, టీఆర్ఎస్ సవాళ్ళ పర్వం
మెదక్ లో రేపు టీఆర్ఎస్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు సవాళ్ళు విసురుకున్నారు. టీఆర్ఎస్ నిర్వహించబోయే బంద్ ను అడ్డుకుంటామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటుండగా, ఎలా అడ్డుకుంటారో చూస్తామని మాజీ ఎంపీ రాజయ్య సవాల్ విసిరారు. కాగా, ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ వసూళ్ళకు పాల్పడుతోందని జగ్గారెడ్డి ఆరోపించారు. అందుకే బంద్ లో ప్రజలెవరూ పాల్గొనవద్దని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. అయితే, శుక్రవారం తాము జరపబోయే బంద్ ను తప్పక విజయవంతం చేస్తామంటూ మాజీ ఎంపీ రాజయ్య ధీమా వ్యక్తం చేశారు.