: శామ్‌సంగ్‌ ప్రధాన కార్యాలయంలో కలకలం.. పేలుడు జ‌ర‌గ‌నుంద‌ని బెదిరింపు


ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శామ్‌సంగ్‌ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు క‌ల‌క‌లం చెల‌రేగింది. ద‌క్షిణ కొరియాలోని శామ్‌సంగ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్ భవనంలో పేలుడు జ‌ర‌గ‌నుంద‌ని బుసాన్‌ నగరంలో ఉంటున్న ఓ వ్యక్తికి ఓ మెసేజ్ వ‌చ్చింది. అక్క‌డి పోలీసుల‌కు ఈ సమాచారం అంద‌డంతో వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు కార్యాలయంలోని 3వేల మంది ఉద్యోగులను ఖాళీ చేయించి, రెండు గంటల పాటు సోదాలు చేశారు. అయితే, ఆ కార్యాల‌యంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవ‌ని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ బెదిరింపు మెసేజ్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News