: నేను ఇంజనీర్ని.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే పది మార్గాలను వివ‌రిస్తా: కేజ్రీవాల్


ఎన్నిక‌ల్లో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రుగుతోందంటూ ఎన్డీఏ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. రాజౌరీ గార్డెన్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీయే గెల‌వ‌డంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ అంశాన్ని మ‌రోసారి లేవ‌నెత్తుతూ.. ఉప ఎన్నిక‌ల ఫలితం ముందుగా ఊహించిందేనని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల‌ పంజాబ్ ఎన్నికల్లోనూ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని అన్నారు. తాను ఐఐటీ ఇంజినీర్‌నని పేర్కొన్న కేజ్రీవాల్‌... తాను ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే పది మార్గాలను వివ‌రిస్తాన‌ని వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు పూణే నుంచి ఓ స్వతంత్ర అభ్యర్థి పోటీచేస్తే, ఆయ‌న‌కు ఒక్క ఓటు కూడా రాలేద‌ని, మ‌రి ఆ అభ్య‌ర్థి త‌న‌కు తాను వేసుకున్న ఓటు ఎక్కడికి వెళ్లినట్లని కేజ్రీవాల్ అన్నారు. ఇటువంటివి చోటుచేసుకుంటున్న‌ప్పుడు కచ్చితంగా అనుమానాలు వ‌స్తాయ‌ని చెప్పారు. యూరోపియన్ దేశాలు ఈవీఎంలను నిషేధించాయ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News