: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి పీవీ సింధు ఔట్!
భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయింది. దీంతో సిరీస్ నుంచి నిష్క్రమించింది. నిన్న జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో సింధు 19-21, 21-17, 21-8 తేడాతో ఇండోనేషియాకు చెందిన 27వ ర్యాంకర్ ఫిత్రానిపై విజయం సాధించి క్వార్టర్ కు చేరింది. అయితే, ఈ రోజున జరిగిన క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో సింధు పరాజయం పాలయింది. పీవీ సింధుపై 21-11, 21-15 తేడాతో మారిన్ విజయం సాధించింది.