: ‘బాహుబలి’ లాంటి సినిమాలు తీయడం కన్నా చూడటానికే ఇష్టపడతా: దర్శకుడు పూరీ జగన్నాథ్
‘బాహుబలి’ లాంటి సినిమాలు తీయడం కన్నా వాటిని చూడటానికే తాను ఇష్టపడతానని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘బాహుబలి లాంటి సినిమాలను తీయడం కన్నా వంద రూపాయలు ఖర్చు పెట్టి చూడటం ఈజీ. ఏ స్క్రిప్ట్ అయినా సరే, రెండు నెలల తర్వాత నాకు బోర్ కొట్టేస్తుంది. సో, అటువంటి సినిమాలను చూడటమే బెటర్. నా సినిమా కంటే, నా స్క్రిప్ట్ కంటే .. రెండు సంవత్సరాల టైమ్ చాలా విలువైందని నేను నమ్ముతాను. అందుకని, నేను టైమ్ వేస్టు చేసుకోను. నాదే కాదు, మిగిలిన అందరి టైమ్ వేస్టవుతుంది కదా!’ అని చెప్పుకొచ్చారు.