: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం... పోలీసుల అదుపులో తెలుగు యువత నేత
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తెలుగు యువతకు చెందిన ఓ నేత మోసాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగు యువత నేత పోలవరపు హరిబాబు ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. లక్షల రూపాయలు వసూలు చేసి తమను మోసం చేశారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో, హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు పేరిట అతను ఈ దందాలకు పాల్పడుతున్నట్టు బాధితులు ఆరోపించారు. కాగా, హరిబాబుపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.