: కెనడా ప్రధాని నోట పంజాబీ మాట!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నోట పంజాబీ మాటలు వచ్చాయి. సిక్కుల ‘వైశాఖి’ పండగ సందర్భంగా ట్రూడో తన ఫేసుబుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఓ వీడియోలో శుభాకాంక్షలు తెలిపారు. ‘వాహే గురూజీ కా ఖాల్సా, వాహే గురూజీకి ఫతే’ అంటూ పంజాబీలకు శుభాకాంక్షలు తెలిపారు. సిక్కు జాతీయులు కెనడా దేశాన్ని బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ వీడియో పోస్ట్ చేసిన ఎనిమిది గంట్లలోనే నెటిజన్లు నాలుగు లక్షల సార్లు చూశారు.