: చీరలు కట్టుకుని తమిళ రైతుల వినూత్న నిరసన!
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ తమిళ రైతులు ఢిల్లీలో నెల రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఈ రోజు వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. తామంతా కావేరి నది బిడ్డలమంటూ చీరలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడులో కరవు రాజ్యమేలుతోందని, కేంద్రం తక్షణ సాయం ప్రకటించాలని కోరుతూ తమిళ రైతు నిరసనలు నిర్వహిస్తున్నారు.