: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా గెహ్లాట్?
రాష్ట్రపతి రేసులో తాను లేనంటూ బీజేపీ కురువృద్ధుడు అద్వానీ కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరో పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన గెహ్లాట్ కు ఆరెస్సె్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనను రాష్ట్రపతిని చేస్తే, దళితుల ఓట్లను కొల్లగొట్టవచ్చనేది బీజేపీ ఎత్తుగడగా చెబుతున్నారు.