: అంబేద్కర్ ను కాంగ్రెస్ ఎన్నడూ సమర్థించలేదు: వెంకయ్య


మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ రిజర్వేషన్ల వల్ల సామాజిక అశాంతి నెలకొంటుందని, వివిధ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తుతుందని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కాంగ్రెస్ ఏనాడూ సమర్థించలేదని మండిపడ్డారు. అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ కు 30 ఏళ్లు పట్టిందని, పార్లమెంటులో విగ్రహం పెట్టడానికి 50 ఏళ్లు పట్టిందని విమర్శించారు. అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని అన్నారు. మత విశ్వాసాలు, ఆహారపు అలవాట్ల గురించి ఘర్షణలు పడరాదని ఆయన అన్నారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు కాలం చెల్లిందని చెప్పారు.

  • Loading...

More Telugu News