: రూ. 103 కే అన్ లిమిటెడ్ కాలింగ్, 4జీ డేటా: టెలినార్ ఆఫర్
జియో దెబ్బకు టెలికాం కంపెనీలన్నింటికీ దిమ్మతిరిగిపోయింది. ఇప్పుడు జియోకే దిమ్మతిరిగే ఆఫర్ ను టెలినార్ ప్రకటించింది. కేవలం రూ. 103 రూపాయలకే అన్ లిమిటెడ్ కాలింగ్, 4 జీ డేటాను అందించనున్నట్టు టెలినార్ తెలిపింది. ఈ స్కీమ్ కింద అన్ లిమిటెడ్ 4జీ డేటా 60 రోజుల పాటు వాడుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్ ను 90 రోజుల వరకు చేసుకోవచ్చు. కొత్త యూజర్లకయితే... రూ. 103 స్కీమ్ కింద 25 రూపాయల ఉచిత టాక్ టైమ్ తో పాటు నిమిషానికి 25 పైసలు మాత్రమే కాల్ ఛార్జ్ పడుతుంది. అపరిమిత 4జీ డేటా రోజుకు 2జీబీ వరకు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. 2జీబీ డేటా అయిపోతే డేటా స్పీడ్ 128 కేబీసీఎస్ కు పడిపోతుంది.