: అంబేద్కర్ చూపిన బాటలోనే నడుద్దాం: జగన్
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఘన నివాళి అర్పించారు. ఈ ఉదయం పులివెందులలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన బాటలోనే అందరం నడుద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి మనమందరం ప్రయత్నిద్దామని చెప్పారు. మరోవైపు, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నట్టు ట్విట్లర్లో కూడా జగన్ తెలిపారు.