: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి కుమారుడి అదృశ్యం.. కేసు నమోదు


ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సుందర్‌కుమార్ దాస్ కుమారుడు పృథ్వీ (25) అదృశ్యమయ్యాడు. సుందర్‌కుమార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగంలో డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు. హాఆఆఇదరాబాదు, అమీర్‌పేట సమీపంలోని ధరమ్‌కరణ్ ప్రాంతంలో వీరి కుటుంబం నివసిస్తోంది. బుధవారం ఉదయం మొబైల్ ఫోన్‌ను ఇంట్లో వదిలి వెళ్లిన పృథ్వీ గురువారం రాత్రి వరకు ఇంటికి తిరిగి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన పృథ్వీ తల్లి ఉషారాణి ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News