: మూలిగే నక్కపై తాటిపండులా..
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు చందంలా తయారైంది. స్వీయ ప్రవాసం వీడి ఇటీవలే స్వదేశం చేరిన ముషారఫ్ ను కేసులు ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు. ఇంతకుముందు బేనజీర్ భుట్టోపై హత్యాయత్నం కేసులో అరెస్టయిన ఈ మాజీ సైనిక జనరల్ మరో కేసులో అరెస్టయ్యారు. 2006లో ముషారఫ్ దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న సమయంలో సైన్యం జరిపిన కాల్పుల్లో బెలూచిస్తాన్ నేత అక్బర్ బుగ్టీ హతుడయ్యాడు. తాజాగా బుగ్టీ హత్యానేరంపై ముషారఫ్ ను పోలీసులు నేడు అరెస్టు చేశారు. ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లోనే రిమాండ్ ఖైదీగా ఉన్న ముషారఫ్ ను పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.