: నేడు ఐపీఎల్ 10లో తొలి మ్యాచ్ ఆడనున్న కోహ్లీ


ఐపీఎల్, కోహ్లీ అభిమానులకు  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు శుభవార్త వినిపించింది. నేడు ముంబై ఇండియన్స్ జట్టుతో జరగనున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆడనున్నాడని ప్రకటించింది. విరాట్ కోహ్లీ ఆసీస్ తో మూడో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. అనంతరం చికిత్స తీసుకున్న కోహ్లీ... 100కి 120 శాతం ఫిట్ నెస్ సాధిస్తే కానీ మ్యాచ్ లో ఆడనని తెగేసి చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీ ముందు పూర్తి ఫిట్ నెస్ సాధించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. తాజాగా, కోహ్లీ భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని ఆర్సీబీ తెలిపింది. ఈ మేరకు కోహ్లీకి వివిధ పరీక్షలు నిర్వహించిన బీసీసీఐ మెడికల్ టీమ్... కోహ్లీ పూర్తి ఫిట్ నెస్ సంతరించుకున్నాడని టీమిండియా, ఆర్సీబీ జట్లకు తెలిపింది. దీంతో నేటిమ్యాచ్ లో క్రికెట్ అభిమానులు కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలు వీక్షించనున్నారు. 

  • Loading...

More Telugu News