: తండ్రి భుజాలపై ఎక్కి కూర్చున్న సల్మాన్ సోదరి చిన్ననాటి ఫొటో!
నవ్వులు చిందిస్తూ తండ్రి భుజాలపై ఎక్కి కూర్చున్న సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ తన చిన్ననాటి ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. అర్పితా ఖాన్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఈ రోజు పోస్ట్ చేసిన ఈ ఫొటోకు లైక్స్ బాగానే వచ్చాయి. ‘డాడీ టైమ్! చైల్డ్ హుడ్ మెమొరీస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో చిన్నారి అర్పిత, ఆమె తండ్రి సలీమ్ ఖాన్ నవ్వుతూ ఉన్నారు. కాగా, అర్పితా ఖాన్ కొడుకు అహిల్ మొదటి పుట్టిన రోజు వేడుకలను మాల్దీవ్స్ లో ఇటీవల జరుపుకున్నారు. ఈ వేడుకలకు అహిల్ మేనమామ సల్మాన్ ఖాన్ సహా వారి కుటుంబంలోని వారందరూ హాజరయ్యారు.