: జనసేన అధినేతా! నాటి మాటను నిలబెట్టుకో: ఉండవల్లి, పెనుమాక రైతులు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నాడు తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుంటూరు జిల్లాలోని పెనుమాక, ఉండవల్లి రైతులు కోరారు. ఏపీ రాజధాని అమవరావతి నిర్మాణం నిమిత్తం చేపట్టిన భూ సమీకరణ నుంచి తమను తప్పించాలని రైతులు కోరారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రెండేళ్ల కిందట తమను ఆదుకుంటామని పవన్ మాట ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరుతూ పవన్ కు ఓ లేఖ రాశారు.