: రిజర్వేషన్లలో మార్పులతో బీసీలకు జరిగే నష్టాన్ని నివారించాలి: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ


తెలంగాణలో రిజర్వేషన్లలో మార్పులతో బీసీలకు జరిగే నష్టాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన ఓ లేఖ రాశారు. రిజర్వేషన్లలో మార్పులతో ముఖ్యంగా బీసీలకు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు అందకుండాపోతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. రజకులను ఎస్సీలోకి, కాయితి లంబాడీలు, వాల్మీకి బోయలు, వడ్డెర్లను ఎస్టీలోకి చేర్చే అంశంపై కూడా అసెంబ్లీలో చర్చించాలని ఈ లేఖలో రేవంత్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News