: ‘స్పైడర్’ సినిమాలో రకుల్ క్యారెక్టర్ గురించి వెల్లడించిన మహేశ్.. న్యూ స్టిల్స్ అదుర్స్!
మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'స్పైడర్' సినిమా ఫస్ట్‌లుక్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని మరో లుక్ బయటకు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా మహేష్‌బాబు ఓ తమిళ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మూవీలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుందని అన్నాడు. అంతేగాక, ఆ పత్రిక మహేష్ ఇంటర్వ్యూతో పాటు సినిమాలోని కొన్ని స్టిల్స్ ను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం స్పైడర్ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సినిమాలో రకుల్ పాత్రపై మహేష్ క్లారిటీ కూడా ఇచ్చేయడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. మహేష్ బాబు చేతిలో ఉన్న మొబైల్ లోకి కనుగుడ్లు తిప్పుకొని చూస్తున్న రకుల్ ఇమేజ్ అదుర్స్ అనిపించేలా ఉంది.