: వచ్చే ఏడాది నుంచి ఉర్దూ మాధ్యమంలో ‘నీట్’


వచ్చే ఏడాది నుంచి ఉర్దూ మాధ్యమంలో కూడా నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఎంఎం సంతాన గౌడర్ తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. వచ్చే నెల 7న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) - 2017ను ఉర్దూ మాధ్యమంలో నిర్వహించే విధంగా ఆదేశాలను జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. వచ్చే నెల 7న నీట్ ప్రవేశ పరీక్ష జరగనుందని, తక్కువ సమయం ఉన్న కారణంగా ఈ ఏడాది నుంచి ఉర్దూ మాధ్యమంలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని చెప్పింది. 

  • Loading...

More Telugu News