: ఐపీఎల్‌ లో పార్థివ్‌ పటేల్‌ అరుదైన రికార్డు


ఐపీఎల్‌ లో 2 వేల పరుగులు పూర్తి చేసిన ఏడో వికెట్‌ కీపర్‌గా పార్థివ్‌ పటేల్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ప్ర‌స్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ముంబయి ఇండియన్స్  త‌ర‌ఫున ఆడుతున్న పార్థివ్‌... నిన్న సాయంత్రం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులు సాధించడంతో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అన్ని ఐపీఎల్ సీజ‌న్‌ల‌తో క‌లిపి ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 106 మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో మొత్తం 104 ఇన్నింగ్స్‌ లలో బ్యాటింగ్ చేసిన పార్థివ్‌.. మొత్తం 2015 పరుగులు పూర్తి చేశాడు.

ఐపీఎల్‌ లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌ కీపర్లు..

1. రాబిన్‌ ఊతప్ప - 3,394 పరుగులు

2. ఏబీ డివిలియర్స్‌ - 3,346 ప‌రుగులు

3. మహేంద్ర సింగ్‌ ధోనీ - 3,298 ప‌రుగులు

4. దినేశ్‌ కార్తీక్ - 2,619 ప‌రుగులు

5. బ్రెండన్‌ మెక్ కల్లమ్ - 2,474 ప‌రుగులు

6. గిల్ క్రిస్ట్ - 2,069 ప‌రుగులు

7. పార్థివ్‌ పటేల్ - 2015 ప‌రుగులు

  • Loading...

More Telugu News