: గుర్రాలు, కత్తులతో మెగాస్టార్ బిజీ బిజీ!
'ఖైదీ నంబర్ 150' సినిమాతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు తన 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి సిద్ధమవుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ పాత్రలో అభిమానులను మెప్పించడానికి రెడీ అవుతున్నారు. గుర్రపు స్వారీ, కత్తిసాములను ప్రాక్టీస్ చేస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు గుర్రం మీదే కనిపించాల్సి ఉండటంతో... ప్రతి రోజు రెండు గంటల సేపు హైదరాబాద్ రేస్ కోర్సులో గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతేకాదు, కత్తి యుద్ధంలోనూ శిక్షణ తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.