: కుల్ భూషణ్ మరణ శిక్షపై తీర్పు చెప్పే స్థాయిలో మేము లేము: ఐక్యరాజ్య సమితి
భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ మరణ శిక్ష విధించడంపై స్పందించేందుకు ఐక్యరాజ్య సమితి నిరాకరించింది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ పత్రిక అడిగిన ప్రశ్నకు ఐరాస సెక్రటరీ జనరల్‌కు అధికార ప్రతినిధి స్టెఫానే డుజరిక్ స్పందిస్తూ, ఈ కేసులో తీర్పు చెప్పే స్థాయిలో తాము లేమని అన్నారు. ఆయనకు మరణ శిక్ష విధించిన ప్రక్రియపై కూడా తమ వైఖరిని చెప్పలేమని పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య సత్సంబంధాల విషయంలో ఆ దేశాలే శాంతియుత పరిష్కారాలను కనుగొనాలని అన్నారు.