: ఒక్కో దెబ్బకు 100 మంది జీహాదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్: గౌతం గంభీర్ ఫైర్


పాకిస్థాన్ కు మద్దతు తెలుపుతూ, రాళ్లు రువ్వుతూ అల్లర్లకు పాల్పడుతున్న ముష్కరులపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కశ్మీర్ ముమ్మాటికీ మాదేనని చెప్పాడు. స్వాతంత్ర్యం కావాలనుకునేవారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్లర్లో గంభీర్ వ్యాఖ్యానించాడు. జెండాలోని మూడు రంగులకు సరికొత్త అర్థాన్ని ఇచ్చాడు. కాషాయం ఆగ్రహ జ్వాలలను సూచిస్తుందని, తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతమని, ఉగ్రవాదంపై ద్వేషాన్ని ఆకుపచ్చ రంగు సూచిస్తుందని చెప్పాడు.

భారతీయ జవానును కొట్టే ఒక్కో దెబ్బకు కనీసం 100 మంది జీహాదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అన్నాడు. కశ్మీరు ముమ్మాటికీ భారత్ లో అంతర్భాగమని... స్వాతంత్ర్యం కావాలనుకునేవారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. కశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, గౌతమ్ గంభీర్ నిప్పులు చెరిగాడు. 

  • Loading...

More Telugu News