: ఈవీఎం ట్యాంపరింగ్ పై మే 8 లోపు సమాధానం చెప్పండి: కేంద్రం, ఈసీకి సుప్రీం ఆదేశం
ఈవీఎంల ట్యాంపరింగ్ పై మే 8 లోపు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే వెసులుబాటు ఉందని, ఉత్తరప్రదేశ్ లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని, దీంతో భవిష్యత్ లో పేపర్ బ్యాలెట్ వాడేలా ఆదేశించాలని, లేని పక్షంలో ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహిస్తే...బిల్లింగ్ తరహాలో ఓటర్ ఓటు వేసిన అనంతరం రసీదు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు కేంద్రం, ఈసీకి నోటీసులు జారీ చేసి, మే 8 లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది.