: హింస భరించలేక... ఇద్దరు భార్యలు కలసి భర్తను అంతం చేశారు!
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ లో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు భార్యలు కలసి తమ భర్తను అంతమొందించారు. వివరాల్లోకి వెళ్తే, తిరుమలయ్య (65) సింగరేణిలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఆయనకు మదునమ్మ, ఐలమ్మ అనే ఇద్దరు భార్యలున్నారు. వీరిద్దరినీ గత కొన్నేళ్లుగా తిరుమలయ్య హింసిస్తున్నాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్యలిద్దరూ కలసి బుధవారం రాత్రి అతన్ని చంపేశారు. తిరుమలయ్య నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.