: తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగిలో భూప్రకంపనలు...ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండల కేంద్రంలో భూప్రకంపనలు సంభవించాయి. ఎండల భయానికి అంతా ఇళ్లలోనే ఉంటున్న వేళ ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించిపోవడంతో ఇళ్ల నుంచి రాజవొమ్మంగి వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూ ప్రకంపనలు మరీ అంత తీవ్రమైనవి కాకపోవడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ఈ తీవ్రత ఎంత? అన్నది తెలియాల్సి ఉంది.