: ఒక్క ఫొటో డీఎంకే శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది!


వయోభారంతో డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బయట కనిపించడమే మానేశారు. ఆయన బాధ్యతలన్నింటినీ ఆయన కుమారుడు స్టాలినే చూసుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ బాధ్యతలను స్వీకరించే సమయంలో కరుణానిధి ఫొటోను ఆ పార్టీ విడుదల చేసింది. ఆ తర్వాత తాజాగా ఆయన లేటెస్ట్ ఫొటోను ఇప్పుడు ఆయన కుమార్తె కనిమొళి ట్విట్టర్లో అప్ లోడ్ చేశారు. ఈ ఫొటోను చూసిన డీఎంకే శ్రేణులు ఆనందంలో మునిగిపోతున్నారు.

  • Loading...

More Telugu News