: తెలుగు మాట్లాడటం కూడా రాని లోకేష్ కు మంత్రి పదవి సిగ్గు చేటు: రోజా ఎద్దేవా


మాతృభాష తెలుగును కూడా సరిగ్గా మాట్లాడలేని నారా లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం సిగ్గుచేటని వైకాపా ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఈ ఉదయం తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె, స్పీకర్ కోడెల శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా మారిపోయారని అన్నారు. చంద్రబాబునాయుడికి అధికారం వస్తేనే, రాష్ట్రానికి కరువు వస్తుందని మరోసారి రుజువైందని, ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. తమ పార్టీ టికెట్ పై పోటీ చేసిన వారికి డబ్బు, పదవులు ఆశ చూపి లాక్కున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం దారుణమని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగ్జరీ భవంతిని నిర్మించుకున్న చంద్రబాబు, పేద ప్రజల కోసం ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News