: లారా అపూర్వ రికార్డుకు 13 ఏళ్లు.. 13 గంటలు.. 97 ఓవర్లు.. 400 పరుగులు!
బ్రియాన్ లారా.. వెస్టిండీస్‌కు చెందిన ఈ మాజీ క్రికెట్ దిగ్గజం అపూర్వ ఇన్నింగ్స్ ఆడి నెలకొల్పిన ప్రపంచ రికార్డుకు నిన్నటి (ఏప్రిల్ 12)తో 13 ఏళ్లు నిండాయి. ఏప్రిల్ 12, 2004న లారా ఇంగ్లండ్‌పై చేసిన అద్భుతాన్ని చూసిన ప్రపంచం జేజేలు పలికింది. ఆ మ్యాచ్‌లో బరిలోకి దిగిన లారా ఏకంగా 13 గంటలపాటు క్రీజులో నిలిచి 97 ఓవర్లు ఎదుర్కొని 400 పరుగులు చేశాడు. ఈ దెబ్బతో గత రికార్డులన్నీ అటకెక్కాయి. 375 పరుగుల సొంత రికార్డుతోపాటు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ హెడెన్ సాధించిన 380 పరుగుల రికార్డు కూడా బద్దలైంది. లారా ఇన్సింగ్స్ చూసిన క్రికెట్ ప్రేమికులు ముగ్ధులయ్యారు. క్రికెట్ ప్రపంచం లారాపై ప్రశంసల వర్షం కురిపించింది.