: 'బాహుబలి 2' విడుదల నిలిపేయమంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్


'బహుబలి: ది బిగినింగ్'కి సీక్వెల్ అయిన 'బాహుబలి: ది కన్ క్లూజన్'ను ఈ నెల 28న విడుదల చేసేందుకు ఆ చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోనే రికార్డు సంఖ్య థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సమయంలో కోలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శరవణన్ మద్రాస్ హైకోర్టులో 'బాహుబలి 2' సినిమా విడుదల నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాతలు తనకు చెల్లించాల్సిన 1.18 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేవరకూ ఈ సినిమా విడుదలను నిలిపేయాలని ఆయన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'బాహుబలి: ది కన్ క్లూజన్' సినిమా విడుదలపై సరికొత్త వివాదం నెలకొంది. 

  • Loading...

More Telugu News