: రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ కి టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య లేఖ
తెలంగాణ సర్కారు రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వేళ సీఎం కేసీఆర్‌కు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ రోజు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను పెంచాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు సర్కారు ముస్లిం రిజర్వేషన్లు పెంచుతోందని, అలాగే బీసీల రిజర్వేషన్లు కూడా 52 శాతానికి పెంచాలని ఆయన అన్నారు. ఎస్టీ జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు పెంచినప్పుడు మరి బీసీల కోటా ఎందుకు పెంచబోరని ఆయన అన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఆ మేరకు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, అలాగే స్ధానిక సంస్థల్లోనూ బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.