: అన్ని వర్గాల ముఖాల్లో చిరునవ్వు చిందితేనే నిజమైన తెలంగాణ వచ్చినట్లు: కేసీఆర్


రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వు చిందితేనే నిజమైన తెలంగాణ వచ్చినట్లని, ఆ దిశ‌గానే త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తూ ముందుకు వెళుతుంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... రిజ‌ర్వేష‌న్ల అంశంపై కొంతమంది చేసే దుష్ప్రచారం సమంజసం కాదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక చరిత్రైతే, రైతు రుణమాఫీ దశల వారీగా చేసుకుంటూ వస్తుండడం మరో చరిత్రని, అలాగే రిజర్వేషన్లపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకొని అన్ని సామాజిక వ‌ర్గాల్లో చిరున‌వ్వు తీసుకొస్తుండ‌డం ఇంకో చ‌రిత్ర‌ని అన్నారు. తాము ముందుగా చెప్పిందే చేస్తున్నామ‌ని, కొత్త‌గా ఏమీ చేయ‌డం లేద‌ని అన్నారు. ఇటీవల ప్ర‌ధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్న ఓ స‌మావేశంలో సదరు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ‌కీయ పార్టీల మానిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలు అమ‌లుప‌ర్చాల‌ని అన్నార‌ని, అందుకోసం క‌ఠిన చ‌ట్టం కూడా తీసుకురావాల‌ని అన్నార‌ని చెప్పారు. తాము అదే విధంగా మేనిఫెస్టోలో చెప్పిందే చేస్తున్నామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News