: ఈవీఎంలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సోనియా, రాహుల్
భారత్‌లో ఎన్నికల్లో ఉపయోగిస్తోన్న ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని, భారతీయ జనతా పార్టీ ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని విపక్ష నేతలు ఎన్నో ఆరోపణలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఇదే అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పిన విపక్ష నేతలు ఈ రోజు ఆయనను కలిశారు. ఆయనను కలిసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా సీపీఐ, బీఎస్‌పీ నేతలు ఉన్నారు. ఈ అంశంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన నేతలు.. ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లనే ఉపయోగించాలని సూచించారు.