: చంద్రబాబు ఇంటిపై విమర్శలు తగదు.. బ్యాంకు లోన్ తీసుకుని కట్టుకున్నారు!: ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి


ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ సవాల్ విసిరారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకు నుంచి రూ.7 కోట్ల రుణం తీసుకుని భువనేశ్వరి, లోకేశ్ ఇల్లు కట్టుకున్నారని అన్నారు. ఈ విషయమై అవాస్తవాలు ప్రసారం చేయవద్దని ఆయన సూచించారు.చంద్రబాబు ఇంటిపై విమర్శలు గుప్పిస్తున్న వారు ముందుగా జగన్ ఇంటిని చూసి ఆ తర్వాత మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను రామకృష్ణ ప్రసాద్ తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News