: ప్రతి రోజూ మారనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మే 1 నుంచి ఈ ఐదు నగరాల్లో అమలు!
ఇకపై ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మారనున్నాయ్. ఇంధన ధరలను ఇకపై ప్రతి రోజు సమీక్షించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా తొలుత ఐదు నగరాల్లో దీన్ని అమలు చేయనున్నారు. విశాఖపట్నం, పుదుచ్చేరి, ఉదయ్ పూర్, జంషెడ్ పూర్, చండీగఢ్ లలో ఈ విధానాన్ని తొలుత అమలు చేయనున్నారు. మే 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ఇప్పటిదాకా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంధన ధరలను సమీక్షిస్తున్నారు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో రోజువారీ సమీక్ష విధానం అమల్లో ఉంది.