: ఉప ఎన్నికల ఫలితాలపై అసహనం వ్యక్తం చేసిన జగన్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన 37 స్థానాలకు గాను 34 స్థానాల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. కేవలం మూడు స్థానాలతోనే వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాలతో వైసీపీ అధినేత జగన్ అసహనానికి గురైనట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా గుడివాడ, మాచర్లలో పార్టీ పరాజయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఈ ఎన్నికల ఫలితాల గురించి వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడటం లేదు. చంద్రబాబు కొత్త నివాసం అంశాన్ని తెరపైకి తెచ్చి, ఈ విషయాన్ని మరుగున పడేసే పని చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఎప్పుడు చూసినా 'దమ్ముంటే ఎన్నికలకు రండి' అంటూ సవాల్ విసిరే వైసీపీ నేతలు... ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.