: తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి


తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిన్నింపేట నుంచి విజయవాడ వెళ్లేందుకు టర్న్ తీసుకుంటున్న లారీని మరో లారీ బలంగా ఢీ కొట్టింది. రెండు లారీలు ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో లారీ నుంచి డ్రైవర్లు తప్పించుకున్నప్పటికీ ఒక క్లీనర్ లారీలో చిక్కుకుపోయాడు. దీంతో రెండు లారీలతో పాటు క్లీనర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. లారీ డ్రైవర్లను ప్రత్తిపాడులోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News