: భారత్ ఆందోళనకు స్పందించిన పాక్.. కుల్ భూషణ్ అప్పీలు చేసుకోవచ్చని వ్యాఖ్య
భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు పాక్ మరణశిక్ష విధించడాన్ని భారత్ తీవ్రంగా నిరసించిన నేపథ్యంలో పాకిస్థాన్ స్పందించింది. మరణశిక్షపై జాదవ్ అప్పీలు చేసుకోవచ్చని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా, పాక్ అధ్యక్షుడు మామున్ హుస్సేన్‌లకు 60 రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. భారత నిఘా సంస్థ ‘రా’ తరపున జాదవ్ గూఢచర్యం చేస్తున్నట్టు తేలడం వల్లే పాక్ మిలటరీ కోర్టు ఆయనను దోషిగా తేల్చి మరణశిక్ష విధించినట్టు ఆసిఫ్ పేర్కొన్నారు. ఈ విషయంలో పాక్ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రశ్నే లేదని ఆయన పేర్కొన్నారు.