: ఈసారి భారత్ ను రెచ్చగొడుతున్న పాక్ రక్షణ మంత్రి
భారత్ పై యుద్ధానికి పాకిస్థాన్ కాలు దువ్వుతోంది. మేము సర్వసన్నద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రకటన తరువాత ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరింత దూకుడుగా మాట్లాడుతున్నారు. జాదవ్ గూఢచర్యం నెరిపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఉరి శిక్ష విధించడానికి ముందు అన్ని నియమ నిబంధనలు పాటించామని, తమ చట్టాలకు లోబడే ఈ శిక్ష విధించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పారు.
జాదవ్ కు విధించిన ఉరిశిక్ష పూర్వాలోచనతో చేసిన పని అని భారత్ ఆరోపిస్తోంది. కానీ, తాము మాత్రం చట్టానికి లోబడే కేసును విచారించామని అన్నారు. చట్టబద్ధమైన నియమ నిబంధనలు పాటించామని చెప్పిన ఆయన, ఈ విషయంలో ఆయనకు పాకిస్థాన్ ఎలాంటి ప్రత్యేక కన్సెషన్ ఇవ్వబోదని తేల్చిచెప్పారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బకొట్టాలని, తమ దేశ సుస్థిరతకు భంగం కలిగించాలని చూసే శక్తులను ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.